: ఒక ఫొటోకు బదులు మరో ఫొటో పోస్టు చేసిన కేంద్ర మంత్రి!
కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో పొరపాటు పడ్డారు. ఒక ఫొటో పోస్టు చేయబోయి మరో ఫొటో పోస్టు చేశారు. ఇంతకీ, ఈ విషయం ఏంటంటే .. గుజరాత్ లోని రాజ్ కోట్ లో కొత్తగా ఓ బస్టాండ్ నిర్మించారు. ఈ బస్టాండ్ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసేందుకు బదులు వేరే ఫొటోను పోస్టు చేశారు.
‘లండన్ లేదా న్యూయార్క్ లో ఎయిర్ పోర్టు కాదు ఇది. గుజరాత్ లోని రాజ్ కోట్ లో కొత్తగా ప్రారంభించిన బస్టాండ్’ అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ఫొటోలను కొందరు ప్రముఖులు కూడా షేర్ చేసుకున్నారు. అయితే, 'రాజ్ కోట్ కొత్త బస్టాండ్ ఇది' అంటూ ఆ ఫొటోను ఓ నెటిజన్ పోస్టు చేయడంతో తాను చేసిన పొరపాటును మంత్రి వర్యులు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో బాబుల్ సుప్రియో వివరణ ఇస్తూ.. తొందరపాటులో తన చిన్ననాటి మిత్రుడొకరు పంపిన ఫొటోలను పోస్ట్ చేశానని సమర్థించుకున్నారు.