: పారిపోయిన ప్రేమికులను గ్రామానికి తీసుకొచ్చి... దారుణానికి పాల్పడ్డ గ్రామస్తులు
రాజస్థాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. బన్‌స్వారా జిల్లాలోని ఓ గ్రామంలో ఓ ప్రేమ జంటను వారి తల్లిదండ్రులే నగ్నంగా ఊరేగించారు. పూర్తి వివరాలు చూస్తే.. ఆ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు, యువతి ప్రేమకు పెద్దలు అడ్డుతగిలారు. వారిద్దరూ రక్త సంబంధీకులు కాబట్టి, పెళ్లి చేసుకోకూడదని అన్నారు. అయితే, పూర్తిగా ప్రేమలో మునిగిపోయిన ఆ జంట పెద్దల మాటను వినిపించుకోలేదు. తాము కలిసే బతికుతామంటూ ఇంట్లో నుంచి దూరంగా పారిపోయారు. అయితే, వారిద్దరు గుజరాత్‌లో ఉంటున్నారని తెలుసుకున్న వారి కుటుంబీకులు అక్కడికి వెళ్లి, వారిని బలవంతంగా స్వగ్రామానికి తీసుకువచ్చారు.
అనంతరం గ్రామస్తులంతా కలిసి వారిద్దరినీ చావగొట్టారు.. నగ్నంగా ఊరేగించారు. ఈ దారుణ ఘటనను ఒకరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. ఈ ఘనటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువతి, యువకుడి తండ్రులతో ఆ పాటు గ్రామానికి చెందిన మొత్తం 18 మందిని అదుపులోకి తీసుకొని, వారిపై కేసులు పెట్టి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.