: చంద్రబాబును చూసి కేసీఆర్ నేర్చుకోవాలి: కాంగ్రెస్ మాజీ ఎంపీ సర్వే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ మండిపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి కేసీఆర్ చాలా నేర్చుకోవాలని సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోయినా... ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు సాధించుకున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ మాత్రం తనకు మోదీ మనసు ఇస్తే చాలు, నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్లీనరీ కోసం నిధులు సేకరించే క్రమంలో చేపట్టిన 'గులాబీ కూలీ' అనేది లంచం తీసుకోవడంలో సరికొత్త విధానమని విమర్శించారు.