: న‌వాజ్ ష‌రీఫ్ భ‌వితవ్యాన్ని నిర్దేశించేలా పాకిస్థాన్ సుప్రీంకోర్టు కీల‌క తీర్పు


ప‌నామా ప‌త్రాల్లో వెలుగు చూసిన పాకిస్థాన్ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్‌ అక్ర‌మాస్తుల అంశం ఆధారంగా విప‌క్ష నేత ఇమ్రాన్ ఖాన్‌తో పాటు ప‌లువురు పాక్ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించి, ఆ అంశంపై విచార‌ణ‌కు ఆదేశించాల‌ని పిటిష‌న్లు దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ పిటిష‌న్లు ఈ రోజు పాకిస్థాన్ సుప్రీంకోర్టులో మ‌రోసారి విచార‌ణకు వ‌చ్చాయి. న‌వాజ్‌ ష‌రీఫ్ అవినీతికి పాల్ప‌డినందున ప‌దవినుంచి తొల‌గించాల‌ని, పిటిష‌న్ల‌ను తిర‌స్క‌రించ‌లేని విధంగా ఆధారాలు ఉన్నాయి కాబ‌ట్టి విచార‌ణ‌కు ఆదేశించాల‌ని పిటిష‌నర్ల త‌ర‌ఫు న్యాయ‌వాదులు కోరారు. ఆయా పిటిష‌న్ల‌ను విచారించిన సుప్రీంకోర్టు పాక్ ప్ర‌ధాని ఫ‌రీష్‌ భ‌విత‌వ్యాన్ని నిర్దేశించేలా కీల‌క‌ తీర్పునిచ్చింది. ఫ‌రీష్‌తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యులు జాయింట్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్ ముందు హాజ‌రు కా‌వాల‌ని, 60 రోజుల్లోగా ద‌ర్యాప్తు బృందం నివేదిక‌ను స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది. దీంతో షరీఫ్ భవితవ్యంపై ఎన్నో ఊహాగానాలు మొదలయ్యాయి. 

  • Loading...

More Telugu News