: ‘మిషన్ భగీరథ’ తొలి ఫలాలు హైదరాబాదుకు అందిస్తున్నాం: మంత్రి కేటీఆర్


మిషన్ భగీరథ పథకం తొలి ఫలాలను హైదరాబాదుకు అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాదు నగరంలో నీటి అవసరాల నిమిత్తం నిర్మించిన నల్లగండ్ల రిజర్వాయర్ ను కేటీఆర్ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాదులోని ప్రతి డివిజన్ కు రోజూ నీరు సరఫరా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. హైదరాబాద్ నగర జనాభా మరో ఐదు రెట్లు పెరిగినా నీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న వారందరికీ హెచ్ఎండబ్ల్యుఎస్ ద్వారా మంచినీటిని సరఫరా చేస్తామన్నారు. శామీర్ పేటలో రూ.7 వేల కోట్లతో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టనున్నామని, ఇందుకు సంబంధించి త్వరలోనే టెండర్లు పిలుస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News