: ఏ క్షణమైనా అమెరికాపై అణు దాడి... ఎవరూ కాపాడలేరు: సంచలన వ్యాఖ్యలు చేసిన యూఎస్ కాంగ్రెస్ మెంబర్
ఉత్తర కొరియా నియంత నేత కిమ్ జాంగ్ ఉన్ నుంచి అమెరికాను రక్షించుకోవడం చాలా కష్టమని, ఏ క్షణంలోనైనా దేశంపై అణ్వాయుధాలతో కొరియా తెగబడే అవకాశాలు ఉన్నాయని, అదే జరిగితే ఎవరూ అమెరికాను కాపాడలేరని యూఎస్ కాంగ్రెస్ సీనియర్ సభ్యుడొకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరకొరియాతో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే, యూఎస్ కు ఎంతో నష్టం కలుగుతుందని, ఆ దేశం యుద్ధానికి సిద్ధమని చెబుతుంటే, సమస్య పరిష్కారానికి పాలకులు కదలకపోవడం దారుణమని విమర్శించారు. ముందుగా కొరియా దాడికి దిగితే అమెరికాలోని ప్రధాన నగరాలు సర్వనాశనమవుతాయని, ఎంతగా బెదిరిస్తున్నా కిమ్ దారికి రావడం లేదని ఆయన గుర్తు చేశారు.