: డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులకు షాక్... వైర్ లెస్ సెట్ ను లాక్కొని పరారైన మందుబాబు
పోలీసులకే షాక్ ఇచ్చిన ఘటన హైదరాబాదు జీడిమెట్ల పరిధిలో ఉన్న షాపూర్ నగర్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, వారం క్రితం షాపూర్ నగర్ రైతు బజార్ వద్ద జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఓ కారు రాంగ్ రూట్ లో వస్తుండగా, దాన్ని ఆపేందుకు ట్రాఫిక్ పోలీసు ప్రయత్నించాడు. అప్పటికే పూర్తిగా మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్... కానిస్టేబుల్ చేతిలో ఉన్న వైర్ లెస్ సెట్ ను లాక్కుని పరారయ్యాడు. ఈ విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో... సదరు కానిస్టేబుల్ నాలుగు రోజుల క్రితం జీడిమెట్ల పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. మరోవైపు, సిగ్నలింగ్ ద్వారా వైర్ లెస్ సెట్ ను కనిపెట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.