: శంషాబాద్ ఎయిర్ పోర్టులో 2.35 కేజీల బంగారం పట్టివేత
హైదరాబాదు శివారు శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఇద్దరు మహిళల నుంచి 2.35 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు. జెడ్డా నుంచి వచ్చిన ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి ఈ బంగారం స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే తాము తెచ్చిన ప్యాకేజీల్లో బంగారం ఉన్నట్టు తమకు తెలియదని ఆ ఇద్దరు మహిళలు చెప్పడం విశేషం. హైదరాబాదులోని తమ బంధువులకు మందులు పంపుతున్నామని జెడ్డా ఎయిర్ పోర్టులో కొందరు వ్యక్తులు తమకు చెప్పారని, ఎయిర్ పోర్టులో లేదా ఆ తరువాత వచ్చి వారు తీసుకుంటారని తెలిపారని, మందులు అని చెప్పడంతో తాము తీసుకొచ్చామని, వారిచ్చిన ప్యాకేజీల్లో ఏముందో చూడలేదని వారు చెబుతున్నారు.