: అప్పట్లో పెళ్లి చూపుల సమయంలో భువనేశ్వరి, చంద్రబాబులు ఏం మాట్లాడుకున్నారు?


తమ పెళ్లి చూపుల సమయంలో తన భార్య భువనేశ్వరితో రెండు మూడు విషయాలు చెప్పానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంత్రి పదవి శాశ్వతం కాదని... మళ్లీ పల్లెకు వెళ్లాల్సిన అవసరం కూడా రావచ్చని... దానికి మానసికంగా సిద్ధంగా ఉంటేనే పెళ్లి చేసుకుందామని భువనేశ్వరికి చెప్పానని అన్నారు. దానికి, ఆమె అంగీకరించడంతోనే తమ పెళ్లి అయిందని తెలిపారు. తమ భవిష్యత్తు గురించి కూడా ఓ పది నిమిషాల సేపు మాట్లాడుకున్నామని చెప్పారు. ఆ తర్వాత పెళ్లి అయ్యేంతవరకు మళ్లీ ఎప్పుడూ మాట్లాడుకోలేదని తెలిపారు. తనతో మాట్లాడాలని అనిపిస్తున్నప్పటికీ... మాట్లాడితే బాగుండదేమో అని ఆగిపోయేవాడినని చెప్పారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు.

  • Loading...

More Telugu News