: సమంతలో అద్భుత యుద్ధ కళ... మీరూ చూడండి


అక్కినేని వారి కాబోయే కోడలు, అగ్ర హీరోయిన్ సమంత కొత్త విద్యను ప్రాక్టీస్ చేస్తోంది. ఇంతవరకు సాఫ్ట్ రోల్స్ లో కుర్రకారును హుషారెత్తించిన ఈ అమ్మడు... ఇప్పుడు కర్రసాము చేస్తోంది. తనకు ఛాలెంజ్ లంటే చాలా ఇష్టమని... ఈ విద్యలో త్వరలోనే ప్రావీణ్యం సంపాదిస్తానని ట్వీట్ చేసింది. అయితే, కేవలం హాబీగానే కర్రసామును నేర్చుకుంటోందా? లేక ఏదైనా సినిమా కోసమా? అనే డౌట్ వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల్లో నటిస్తున్న సమంత... తమిళంలో కూడా రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

  • Loading...

More Telugu News