: బ్రహ్మానందాన్ని ఆకాశానికెత్తేసిన తెలంగాణ స్పీకర్!


ప్రముఖ సినీ హాస్యనటుడు బ్రహ్మానందంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి ప్రశంసల జల్లు కురిపించారు. అన్ని భావాలను వ్యక్తీకరించే గొప్ప అవకాశం ఈ సృష్టిలో కేవలం మానవులకు మాత్రమే ఉందని... మానవ జాతిని నవ్వించడం ఒక గొప్ప వరమని... ఎన్నో సమస్యలతో సతమతమయ్యే మనందరినీ నవ్వించగలిగే గొప్ప వ్యక్తి హాస్య బ్రహ్మ బ్రహ్మానందం అంటూ మధుసూదనాచారి ప్రశంసించారు.

సర్వరోగాలను హాస్యం నయం చేస్తుందని... తన హాస్యంతో ఎంతో మందిని ఆరోగ్యవంతులుగా చేసిన ఘనత బ్రహ్మానందంకు దక్కుతుందని కొనియాడారు. ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో చార్లీ చాప్లిన్ 128వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మానందంకు చార్లీ చాప్లిన్ ఇంటర్నేషనల్ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ, తెలుగువారిని నవ్వించడానికే బ్రహ్మానందం పుట్టాడని అన్నారు.

  • Loading...

More Telugu News