: పన్నీర్ కు సీఎం, పళనికి కేంద్ర మంత్రి పదవి... చక్రం తిప్పిన బీజేపీ


తమిళనాడు రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. ఆ రాష్ట్రంలో అడుగుపెట్టేందుకు ఆత్రుతగా ఉన్న బీజేపీ... ఇప్పుడు అందివచ్చిన అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. శశికళ, దినకరన్ లకు చెక్ పెట్టేందుకు తనవంతు సహకారం అందించిన బీజేపీ... ఇప్పుడు అన్నాడీఎంకేతో సన్నిహిత సంబంధాలను పెంచుకునే పనిలో పడింది. పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాల మధ్య చెలిమి కుదర్చడంలో బీజేపీ వేసిన స్కెచ్ దాదాపు ఫలప్రదమైందని తెలుస్తోంది.

జయలలితకు నమ్మినబంటుగా పేరుగాంచిన పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రిగా చేసి, ప్రస్తుత సీఎం పళనిస్వామికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించేలా ఇరువురు నేతలను బీజేపీ పెద్దలు ఒప్పించగలిగారు. దీంతో, ఓపీఎస్, ఈపీఎస్ ల మధ్య సయోధ్య కుదిర్చినట్టు అవుతుంది. అంతేకాదు, బీజేపీ కూటమిలో అన్నాడీఎంకే అధికారికంగా భాగస్వామి అయినట్టు అవుతుంది. దీంతో, రాష్ట్రపతి ఎన్నికల సమయంలో బీజేపీకి బలం మరింత పెరుగుతుంది. 

  • Loading...

More Telugu News