: ఆలస్యమైనా మంచి పని చేశారు: శశికళను దూరం పెట్టడంపై ఆమె మేనల్లుడి స్పందన


అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ కుటుంబాన్ని పార్టీకి దూరంగా ఉంచాలన్న నిర్ణయంపై శశికళ తమ్ముడు దివాకరన్ కుమారుడు జయానంద్‌ ఫేస్ బుక్ లో స్పందించారు. పార్టీలో శశికళతోపాటు ఆమె కుటుంబం మొత్తాన్ని దూరంగా ఉంచాలన్న మంత్రుల నిర్ణయం తెలివైనదని ఆయన కొనియాడారు. ఈ విషయాన్ని తాము కొన్ని నెలల క్రిందటే చెప్పామని ఆయన తెలిపారు. అప్పుడు ఎవరూ పట్టించుకోలేదని ఆయన అన్నారు.

అయితే ఆలస్యంగా తీసుకున్నా గొప్ప నిర్ణయం తీసుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, ఆర్కేనగర్ ఉపఎన్నికల అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో పార్టీ ప్రతిష్ఠ మసకబారి, ప్రజల్లో ఆదరణ కోల్పోవడంతో మేల్కొన్న నేతలంతా ఏకమై శశికళ, దినకరన్ లను బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఇకపై పార్టీలో వారికి ఎలాంటి ప్రాతినిధ్యం ఉండకూడదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News