: తల్లికాబోతున్న టెన్సిస్ స్టార్ సెరెనా విలియమ్స్


అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ (35) అభిమానులకు శుభవార్త వినిపించింది. త్వరలో తల్లి కాబోతున్నానని తెలిపింది. ప్రస్తుతం తాను 20 వారాల గర్భవతినని ప్రకటించింది. ఈ మేరకు స్నాప్‌ చాట్‌ లో తన ఫొటో కూడా పెట్టింది. అనంతరం సెరేనా ఆ ఫొటోను తొలగించింది. ఆమె పెట్టిన పోస్టుకు అంతర్జాతీయ మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) శుభాకాంక్షలు కూడా చెప్పింది.

కాగా, సెరేనా విలియమ్స్ రెడిట్‌ సహవ్యవస్థాపకుడు అలెక్సిస్‌ ఒహానియన్‌ తో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి గత డిసెంబర్ లో నిశ్చితార్థం జరిగింది. మార్చిలో జరిగిన ఇండియన్ వేల్స్ టోర్నీ నుంచి మోకాలి గాయంతో తప్పుకుంటున్నానని ప్రకటించిన సంగతి విదితమే! 

  • Loading...

More Telugu News