: తిరుమల వెంకన్న భక్తులకు శుభవార్త.. అందుబాటులోకి 50 గ్రాముల వెండి డాలర్లు
తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. బుధవారం నుంచి భక్తుల కోసం ప్రత్యేకంగా 50 గ్రాముల వెండి డాలర్లను అందుబాటులోకి తెచ్చింది. శ్రీవారి ఆలయం, లడ్డూ కౌంటర్లలోని డాలర్ల కేంద్రంలో వీటిని విక్రయిస్తున్నట్టు తెలిపింది. ఈ డాలర్లపై ఓవైపు స్వామివారు, అమ్మవారు, మరోవైపు 50 గ్రామ్స్ సిల్వర్ 999.0 అని ఉంది. ఈ డాలర్ ధర రూ.2,625గా నిర్ణయించారు. వీటిని విడుదల చేసిన తొలిరోజే 10 డాలర్లు అమ్ముడైనట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.