: ‘ఇండియన్ ఐడల్’ రేవంత్ ను అభినందించిన చంద్రబాబు


సీఎం చంద్రబాబు నాయుడుని ఇండియన్ ఐడల్ విజేత రేవంత్ ఈ రోజు కలిశాడు. ఈ సందర్భంగా రేవంత్ ను అభినందించి, శాలువాతో సత్కరించి.. ఓ జ్ఞాపికను చంద్రబాబు అందజేశారు. పేద కుటుంబం నుంచి వచ్చిన రేవంత్, అత్యున్నత ప్రతిభ కనబరిచాడని, యువతకు ఆదర్శంగా నిలిచాడని చంద్రబాబు ప్రశంసించారు. ప్రభుత్వం తరపున ఎలాంటి ప్రోత్సాహం అందించాలనే అంశంపై ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని ఏపీ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ విజయ్ భాస్కర్ ను ఆయన ఆదేశించారు. 

  • Loading...

More Telugu News