: నిండు గర్భిణికి నిప్పు పెట్టిన భర్త.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బిడ్డకు జన్మనిచ్చిన భార్య
నిండు గర్భిణి అని కూడా చూడకుండా కట్టుకున్న భార్యకే నిప్పు పెట్టాడో కసాయి. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలోని నిజాంకాలనీలో చోటుచేసుకుంది. అనంతరం ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించగా కాలిన బాధలు భరిస్తూనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలి భర్త మాజిద్ ఖాన్ను అరెస్టు చేసి, ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భార్య నుంచి అదనపు కట్నం ఆశించే ఆ వ్యక్తి ఈ చర్యకు పాల్పడ్డాడని బాధితురాలి బంధువులు అంటున్నారు.