: జయలలితకు చెందిన బంగళాలో అగ్నిప్రమాదం!


దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చెందిన ఓ బంగళాలో అగ్నిప్రమాదం సంభవించింది. కాంచీపురం జిల్లాలోని సిరుదావూరులో ఆమెకు ఓ బంగళా ఉంది. ఆ బంగళా ఆవరణలో ఎండిన ఆకులు, చెత్తను పనివారు తగులబెడుతున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నించారు. అయితే, ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు, విలువైన వస్తువులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.  

  • Loading...

More Telugu News