: ముస్లిం రిజర్వేషన్ల బిల్లు చిత్రవిచిత్రమైంది... మోసపూరితమైంది: జైపాల్ రెడ్డి


ముస్లింలకు రిజర్వేషన్లను కల్పించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు చాలా చిత్రవిచిత్రమైందని, మోసపూరితమైందని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. ఈ బిల్లు ప్రధాని మోదీ చేతిలో కాని, సుప్రీంకోర్టు చేతిలో కాని సమాధి కావాల్సిందే అని చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాల్లో వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్ ఉందని... ముస్లింలపై కేసీఆర్ కు అంత ప్రేమ ఉంటే ఈ బిల్లును తీసురావడానికి మూడేళ్లు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ఎస్టీ, ముస్లిం రిజర్వేషన్లను కలిపి బిల్లు తీసుకురావడాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీల జాతుల్లో ఏ ఒక్క కులాన్ని కలపాలన్నా పార్లమెంట్ ఆమోదం కావాల్సి ఉంటుందని చెప్పారు.

  • Loading...

More Telugu News