: నకిలీ ఖాతాలకు అడ్డుకట్ట... కోట్లాది లైకులను తొలగించిన ఫేస్ బుక్!
ఫేస్ బుక్ లో భారీగా ఫాలోయర్లను కలిగి ఉన్న పలు పేజీలకు ఉన్నట్టుండి 30 శాతం నుంచి 40 శాతం లైకులు పడిపోయాయి. వినడానికి నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం. నకిలీ ఖాతాలను గుర్తించేందుకు ఫేస్ బుక్ చేపట్టిన 'ఆపరేషన్ స్పామ్' కార్యక్రమమే దీనికి కారణం. నకిలీ ఖాతాలను గుర్తించి, వాటిని బ్లాక్ చేయడంతో... ఆయా ఖాతాల నుంచి పలు పేజీలకు వచ్చిన లైకులు కూడా ఆటోమేటిక్ గా తొలగిపోయాయి. ఈ నకిలీ ఖాతాలను గుర్తించేందుకు ఫేస్ బుక్ కు దాదాపు 6 నెలల సమయం పట్టింది. అయితే, ఎక్కువ నకిలీ లైకులు అంతర్జాతీయ వార్తా సంస్థల పేజీలకే వచ్చాయని తేలింది. సిబీఎన్ న్యూస్, యూఎస్ఏ టుడే, బీబీసీ, సీఎన్ఎన్, ఎన్బీసీ న్యూస్, యాహూ న్యూస్ లకు భారీ ఎత్తున నకిలీ లైకులు వచ్చాయి. అన్నింటికన్నా ఎక్కువగా సీబీఎన్ న్యూస్ కు 80 లక్షల నకిలీ లైకులు వచ్చాయట.