: ఇంత ఇబ్బందుల్లో సైతం ఆసక్తికర ట్వీట్ చేసిన మాల్యా


పలు బ్యాంకులకు రూ. 9 వేల కోట్లకు పైగా అప్పులను ఎగ్గొట్టి లండన్ కు పారిపోయిన విజయ్ మాల్యాను అక్కడి స్కాట్ లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం బెయిల్ పై మాల్యా విడుదలయ్యారు. మరోవైపు మాల్యాను ఇక్కడకు రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఇంత గందరగోళ పరిస్థితిలో సైతం విజయ్ మాల్యా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్న వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ నిన్న జరిగిన మ్యాచ్ లో టీ20ల్లో 10 వేల పరుగుల మైలు రాయిన దాటిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాల్యా స్పందిస్తూ... 'కంగ్రాట్స్ గేల్' అంటూ ట్విట్టర్లో ప్రశంసించారు. 'నువ్వు ప్రపంచానికే బాస్' అంటూ కీర్తించారు.

  • Loading...

More Telugu News