: దేశవ్యాప్తంగా 63 ఈ- దర్శన్ కేంద్రాలను మూసివేస్తూ టీటీడీ సంచలన నిర్ణయం


దేశవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తూ, భక్తులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విక్రయించే 63 ఈ-దర్శన్ కేంద్రాలను మూసివేయాలని టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుపతి, చెన్నై, బెంగళూరు, పుదుచ్చేరి తదితర ప్రాంతాల్లో ఉన్న అన్ని ఈ-దర్శన్ కేంద్రాలను మూసివేస్తున్నామని, ఇకపై భక్తులకు 24 కేంద్రాల నుంచి మాత్రమే సేవలందుతాయని అధికారులు ప్రకటించారు. ఇటీవలి కాలంలో ఆన్ లైన్లో విక్రయిస్తున్న ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లకు స్పందన బాగా పెరగడం, ఈ-దర్శన్ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య తగ్గిపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఆయా కేంద్రాలకు ఉన్న కోటాను సైతం ఆన్ లైన్ కు మళ్లిస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News