: 'నవ భారత్ నేషనల్ పార్టీ' పై జూనియర్ ఎన్టీఆర్ స్పందన
'నవ భారత్ నేషనల్ పార్టీ' పేరుతో ఏర్పాటు చేసిన కొత్త రాజకీయ పార్టీకి ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను అధ్యక్షుడిగా నియమించినట్టు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ లేఖ వైరల్ అయింది. అన్ని మీడియాల్లోనూ ఈ వార్త ప్రసారం అయింది. తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉండే జూనియర్ సొంత కుంపటి పెట్టుకున్నాడా? అంటూ పలువురు ఆశ్చర్యపోయారు. ఈ విషయం 'జై లవకుశ' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న జూనియర్ కు తన అభిమానుల ద్వారా తెలిసింది. దీంతో, అతను ఓ చిరునవ్వు నవ్వేశాడట. ఇలాంటి పుకార్లకు తాను పట్టించుకోనని చెప్పాడట. అంతేకాదు, ఈ వార్తలను ఎవరూ పట్టించుకోవద్దని, ఈ మ్యాటర్ ను ఇంతటితో వదిలేయాలని చెప్పాడట. ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందని, ఇప్పటికిప్పుడే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని తెలిపాడు. అలాంటిదేమైనా ఉంటే తానే స్వయంగా ప్రకటిస్తానని చెప్పాడు. దీంతో, సంచలనం రేకెత్తించిన ఓ పుకారుకు ముగింపు పలికినట్టైంది.