: కేవలం 37 సెకన్లలోనే రైలు టికెట్ పొందే అవకాశం!
స్మార్ట్ ఫోన్ ద్వారా రైల్వే టికెట్ పొందే యాప్ ను రైల్వే శాఖ మరింత మెరుగుపరిచింది. దీంతో, కేవలం 37 సెకన్లలోనే రైలు టికెట్ ను పొందవచ్చని భారత రైల్వే ఆహార, పర్యాటక సంస్థ (ఐఆర్ సీటీసీ) తెలిపింది. ఇంటర్నెట్ సౌకర్యం గల స్మార్ట్ ఫోన్లను కలిగిఉన్న వినియోగదారుల సంఖ్య పెరగడంతో... రైల్వే శాఖ ఆన్ లైన్ ద్వారా టికెట్ పొందే అవకాశాన్ని కల్పించింది. 'రైల్ కనెక్ట్' పేరుతో కొన్ని నెలల క్రితం యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ను ఇప్పుడు మరింత మెరుగుపరచడంతో... టికెట్ పొందే సమయం 37 సెకన్లకు తగ్గింది. తత్వాల్ టికెట్లు పొందే ప్రయాణికులు ప్రయాణానికి ఒక రోజు ముందు రిజర్వేషన్లు చేసుకోవచ్చని ఐఆర్ సీటీసీ పేర్కొంది.