: చేనేతకు సమంత బ్రాండ్ అంబాసిడర్ కాదు: స్పష్టం చేసిన కేసీఆర్ సర్కారు


తెలంగాణలో చేనేత దుస్తులకు మరింత ప్రాచుర్యం కల్పించాలన్న భావనలో ఉన్న ప్రభుత్వం, హీరోయిన్ సమంతను చేనేత రాయబారిగా నియమించినట్టు గతంలో వచ్చిన వార్తలు అవాస్తవమని తేలాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో సమంతను చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసినట్టు స్వయంగా కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆమెకు చేనేత ప్రచారకర్త బాధ్యతలేమీ ఇవ్వలేదని, ఆమెను నియమించలేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. చేనేత వర్గాల చైతన్య అధ్యక్షుడు చిక్కా దేవదాసు సమాచార హక్కు చట్టం కింద సమంతపై అడిగిన ప్రశ్నకు చేనేత, జౌళి మంత్రిత్వ శాఖ నుంచి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం వచ్చింది.

  • Loading...

More Telugu News