: రగిలిపోతున్న దినకరన్...జిల్లా నేతలతో సమావేశం!
అన్నాడీఎంకే పార్టీ నుంచి తమను బయటకు గెంటివేయడంపై దినకరన్ రగిలిపోతున్నారు. ఎన్నో ఆశలతో తన అత్తమ్మ తనను డిప్యూటీ జనరల్ సెక్రటరీని చేస్తే... కుట్రపూరితంగా పార్టీ నుంచి గెంటేస్తారా? అని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ ఆధిపత్యానికి మద్దతిస్తున్న 10 మంది ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. వారితో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా ఆ పది మంది ఎమ్మెల్యేలు సీఎం పళనిస్వామి, మాజీ సిఎం పన్నీర్ సెల్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిన్నమ్మ కుటుంబాన్నే అవమానిస్తారా? అంటూ మండిపడ్డారు. అనంతరం సొంత జిల్లా అయిన తేని నేతలకు ఆహ్వానం పంపారు. వారితో నేటి ఉదయం చర్చించనున్నారు. మధ్యాహ్నం బెంగళూరులో ఓ కేసు విషయంలో కోర్టుకు హాజరుకానున్న నేపథ్యంలో,...పార్టీ గుర్తు రెండాకుల కేటాయింపుకు లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసుల విచారణ, అరెస్టుకు వస్తున్నారన్న నేపథ్యంలో ఆయన జిల్లా నేతలతో చర్చించనుండడం ఆసక్తి రేపుతోంది.