: డొనాల్డ్ ట్రంప్ పై అబద్ధపు వార్త.. అది వినగానే ఆనందంతో కన్నుమూసిన వ్యక్తి!


'అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీచ్యుతుడయ్యాడు. ట్రంప్ ను వైట్ హౌస్ నుంచి బయటకు గెంటేశారు' అన్న ఓ అబద్ధపు వార్త వినగానే ఓ వ్యక్తి ఆనందంతో కన్నుమూసిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... అమెరికాలోని పోర్ట్‌ ల్యాండ్‌ నివాసి అయిన మిచెల్ గార్లాండ్ ఇల్లియట్ (75) అనే వ్యక్తి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గుండె సంబంధిత వ్యాధితో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయనకు తమ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నా, ఆయన విధానాలు అన్నా పరమ అసహ్యం. డొనాల్డ్ ట్రంప్ పదవీచ్యుతుడైతే ప్రశాంతంగా చనిపోయినా పర్వాలేదని భావించేవాడు.

తీవ్రమైన అనారోగ్యంతో భాధపడుతూ రోజులు లెక్కబెడుతున్న ఆయనకు మాజీ భార్య ఫోన్ చేసింది. ఆయన యోగ క్షేమాలు కనుక్కున్న అనంతరం ఆయనకు శుభవార్త చెబుతున్నానని, వినమని చెప్పింది... అభిశంసన ద్వారా డొనాల్డ్ ట్రంప్ పదవీచ్యుతుడయ్యాడని, వైట్‌ హౌస్ నుంచి ఆయనను బయటకు గెంటేశారని చెప్పింది. అంతే.. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనలో కొత్త ఉత్సాహం, సంతోషం కనిపించాయి. అలా ఆ ఆనందంలోనే.. కాసేపటికే ఆయన ప్రశాంతంగా కన్నుమూశారు. ఈ వార్త వినగానే ఆయన సంతోషపడతారని తనకు తెలుసునని, అందుకే అబద్ధం చెప్పానని మాజీ భార్య వివరణ ఇవ్వడం విశేషం.

  • Loading...

More Telugu News