: కర్ణాటక ఎన్నికలతో జాతీయ వైఖరి వెల్లడి కానుందా..?


దక్షిణాది రాష్ట్రం కర్ణాటక మే 5న ఎన్నికలకు సిద్ధమవుతోంది. మొత్తం 225 స్థానాలకు గాను ఓటర్లు 223 మంది శాసనసభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. వీటిలో ఒకటి నామినేటెడ్ స్థానం కాగా, మరోస్థానంలో బీజేపీ అభ్యర్థి మరణించడంతో అక్కడ ఎన్నిక రద్దు చేశారు. కాగా, ఆదివారం జరగనున్న ఎన్నికల్లో వచ్చే ఫలితాలే రాబోయే లోక్ సభ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతుందని కాంగ్రెస్, బీజేపీ అంటున్నాయి. కన్నడ నాట ఎన్నికలు జాతీయ వైఖరిని వెల్లడిస్తాయని ఆ రెండు పార్టీలు తమ ప్రచార కార్యక్రమాల్లో పేర్కొంటున్నాయి. కాగా, రేపటితో కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది.

  • Loading...

More Telugu News