: యెమెన్ లో కూలిన ఆర్మీ హెలికాఫ్టరు..12 మంది మృతి!
యెమెన్ లో ఆర్మీ హెలికాఫ్టర్ కూలిన సంఘటనలో 12 మంది సైనికులు మృతి చెందారు. సౌదీ సంయుక్త దళాలకు చెందిన ఆర్మీ హెలికాఫ్టర్ ఒకటి ఈ రోజు కూలిపోయింది. మృతులలో నలుగురు సైనికాధికారులు కూడా ఉన్నట్టు సౌదీ ఆర్మీ ప్రతినిధి తెలిపారు. కాగా, యెమెన్ ప్రభుత్వానికి మద్దతుగా 2015 నుంచి రెబల్స్ పై ఈ దళాలు పోరాడుతున్నాయి. ఆర్మీ హెలికాఫ్టర్ కూలిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్మీ వర్గాల సమాచారం.