: మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన రిలయన్స్ జియో
మార్కెట్లోకి అడుగుపెట్టింది మొదలు ఎన్నో సంచలన ఆఫర్లు గుప్పిస్తూ వినియోగదారులను తమ వైపుకు తిప్పుకుంటున్న రిలయన్స్ జియో ఈ రోజు మరో బంపర్ ఆఫర్‌ని ప్రకటించింది. రూ. 501తో రీఛార్జ్‌తో కేవలం నిమిషానికి రూ.3 చెల్లించి విదేశాలకు కాల్ చేసుకునే వెసులుబాటును తీసుకొచ్చింది. కొన్ని దేశాలకు కాల్స్ రూ.3కి, మరికొన్ని దేశాలకు రూ.4.8కి అందిస్తున్నట్లు పేర్కొంది. టెలికాం మార్కెట్లో తమ ప్రత్యర్థి కంపెనీలకు దీటుగా జియో ఈ ఆఫర్లను ప్రకటించింది.
జియో ప్రకటించిన ఈ ఆఫర్లతో నిమిషానికి కేవలం రూ.3కే కాల్స్ అందుబాటులోకి వస్తోన్న దేశాలు:
* అమెరికా, కెనడా, న్యూజిల్యాండ్, కెనడా, హాంగ్‌కాంగ్, సింగపూర్, పోర్చుగల్, రొమేనియా, స్వీడన్, స్విస్, తైవాన్, రష్యా, ఆస్ట్రియా, బెల్జియం, బ్రెజిల్, ఫ్రెంచ్‌గయానా, ఇటలీ, లగ్జెంబర్గ్, మాల్టా, మంగోలియా, మొరాకో, పోలాండ్
నిమిషానికి కేవలం రూ.4.8కే కాల్స్ అందుబాటులోకి వస్తోన్న దేశాలు:
* జపాన్, అర్జెంటీనా, డెన్మార్క్, ఫ్రాన్స్, పాకిస్థాన్, ఇజ్రాయిల్, దక్షిణకొరియా