: రైతులకు శుభవార్త.. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు
రైతులకు శుభవార్త. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడనున్నట్లు భారత వాతావరణ కేంద్ర డైరెక్టర్ జనరల్ కేజే రమేష్ తెలిపారు. ఓ న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, రైతులు ఈ ఏడాది ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, 38 శాతం అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, మే చివరిలో నైరుతి రుతుపవననాలు కేరళను తాకే అవకాశం ఉందని చెప్పారు. వాణిజ్య పంటల కన్నా సంప్రదాయ పంటల వైపు మొగ్గు చూపాలని, గత ఏడాదిలో లాగే ఈ ఏడాది కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలపై నైరుతి, ఈశాన్య రుతు పనవాల ప్రభావం అధికంగా ఉంటుందని, ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం తగ్గుముఖం పడుతుందని ఆయన వివరించారు.