: టీడీపీని వీడి, వైసీపీలో చేరనున్న శిల్పామోహన్ రెడ్డి?
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీ ఇన్ చార్జి శిల్పా మోహన్ రెడ్డి ఆ పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21న లేదా 22వ తేదీన వైఎస్సార్సీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శిల్పా మోహన్ రెడ్డి తన సన్నిహితులతో, అనుచరులతో ఇప్పటికే సమావేశమైనట్టు సమాచారం. కాగా, నంద్యాల ఉప ఎన్నికలో తనకు టీడీపీ టిక్కెట్టు దక్కకపోవడంతో ఆయన మనస్తాపం చెందారని, ఈ నేపథ్యంలోనే పార్టీని వీడనున్నారని తెలుస్తోంది.