: 'బ్యాంక్ చోర్' సినిమా ప్రమోషన్ కోసమే మాల్యాను భారతదేశానికి తీసుకొస్తున్నారు: సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు


భార‌తీయ బ్యాంకులను రూ.9 వేల కోట్లకు ముంచేసి, విదేశాల‌కు జంప్ అయిన వ్యాపార‌వేత్త విజ‌య్ మాల్యాను లండ‌న్ పోలీసులు ఈ రోజు అరెస్టు చేసిన అంశంపై సోష‌ల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ట్విట్టర్‌లో భారత్ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది టాప్ ఫైవ్ ట్రెండింగ్ టాపిక్‌గా నిలిచింది. మాల్యాపై జోకులు పేల్చుతూ నెటిజ‌న్లు త‌మ ప్ర‌తిభనంతా చూపిస్తున్నారు. విజ‌య్ మాల్యా గ‌త ఏడాది మార్చి 2న (సరిగ్గా ఐపీఎల్ సీజన్‌ ప్రారంభం కావడానికి ముందు) లండన్ పారిపోయిన విష‌యం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతో ఆ మ్యాచ్‌లు చూసేందుకే మాల్యా వ‌స్తున్నాడ‌ని కొంద‌రు పోస్టులు చేస్తున్నారు.

విజ‌య్ మాల్యా ఒక‌ప్పుడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు యజమాని అన్న విష‌యం తెలిసిందే. దీంతో ఆర్సీబీ జట్టు పెర్ఫార్మెన్సు ఇక్కడే కాదు, లండన్‌లో కూడా బాగోలేదని కొంద‌రు సెటైర్లు వేస్తున్నారు. ఇక దర్శకుడు శిరీష్ కుందర్ త‌మ ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ఇదే అంశంపై స్పందిస్తూ...  'బ్యాంక్ చోర్' సినిమా ప్రమోషన్ కోసమే విజ‌య్ మాల్యాను లండ‌న్‌నుంచి తీసుకొస్తున్నార‌ని పేర్కొన్నాడు. ఇలా ఒక‌టి, రెండు కాదు.. మాల్యాపై సెటైర్ వేయ‌డానికి ప్ర‌పంచంలోని అన్ని అంశాల‌ను వాడేసుకుంటున్నారు. అందులో కొన్నింటిని మీరూ చూడండి...














  • Loading...

More Telugu News