: విజయ్ మాల్యాకు బెయిల్ మంజూరు!


లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను స్కాట్ ల్యాండ్ యార్డ్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను లండన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో, విజయ్ మాల్యా బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్నారు. పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు... మాల్యాకు బెయిల్ మంజూరు చేసింది. అరెస్ట్ అయిన మూడు గంటల్లోనే విజయ్ మాల్యా బెయిల్ పొందడం గమనార్హం. 

  • Loading...

More Telugu News