: చంద్రబాబుకు కేవీపీ రామచంద్రరావు లేఖ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. ఈ నెల 23న జరగనున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ లో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తాలని ఆయన డిమాండ్ చేశారు. అవసరమైన రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కొనసాగించాలని ఆయన కోరారు. ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుందని అన్నారు. ప్రత్యేక హోదా లేకపోతే ఎన్నికల సమయంలో ప్రజల వద్దకు వెళ్లడం కష్టమని చెప్పారు.