: సమైక్య రాష్ట్రంలో ఉన్న సమస్యలే ఇంకా కొనసాగుతున్నాయి: తెలంగాణ ఉద్యోగ సంఘాలు
ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉన్న డిమాండ్లను పరిష్కరించాలంటూ తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు ఏ సమస్యలు ఉన్నాయో... ఇప్పుడు కూడా ఆ సమస్యలు కొనసాగుతూ ఉన్నాయని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సర్వం ధారపోసిన తమకు ఒరిగింది ఏమీ లేదని వారు వాపోయారు. ఉద్యమంతో ఏ మాత్రం సంబంధం లేని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మాత్రం భారీగా లబ్ధి పొందుతున్నారని విమర్శించారు.