: ఎట్టకేలకు లండన్‌లో విజయ్ మాల్యా అరెస్టు.. త్వరలో ఇండియాకి తరలింపు!
లిక్కర్ కింగ్, బడా వ్యాపార వేత్త విజయ్ మాల్యాను లండన్‌లో పోలీసులు అరెస్టు చేశారు. విజయ్‌మాల్యా గత ఏడాది భారతీయ బ్యాంకులకు 9 వేల కోట్లు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బ్రిటన్ తో ఇండియాకి కుదిరిన ఓ ఒప్పందం మేరకు ఈ అరెస్టు జరిగిందని తెలుస్తోంది. దేశం నుంచి తప్పించుకొని పారిపోయిన విజయ్ మాల్యాపై భారత్ లోని పలు న్యాయస్థానాలు ఎన్నో సార్లు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
విజయ్ మాల్యా మాత్రం తనకు జారీ చేసిన సమన్లపై స్పందించకుండా మొండి వైఖరి కనబర్చారు. అంతేగాక, లండన్ లో ఎంజాయ్ చేస్తూ ట్విటర్ లో ట్వీట్లు చేస్తూ భారతీయులకు ఆగ్రహం తెప్పించారు. ఆయనను భారత్ కు రప్పించడానికి అక్కడి చట్టాలు అడ్డుపడ్డాయి. భారత్ ప్రభుత్వం, యూకే మధ్య కుదిరిన ఓ ఒప్పందం ప్రకారం యూకే పోలీసులు ఈ రోజు ఆయనను అరెస్టు చేశారు. త్వరలోనే ఆయనను ఇండియాకు తరలించే అవకాశం వుంది.