: మరోమారు పొరపాటు పడ్డ లోకేశ్!
ఏపీ యువ మంత్రి నారా లోకేశ్ మరోమారు పొరపాటు పడ్డారు. ఇటీవల జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న లోకేశ్ ..‘అంబేద్కర్ వర్ధంతి’ అంటూ పొరపాటు పడటం తెలిసిందే. తాజాగా, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కరపలో నిర్వహించిన సభలో లోకేశ్ పాల్గొన్నారు. రాబోయే రెండేళ్లలో అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరించడమే తన లక్ష్యమని లోకేశ్ చెప్పాలనుకున్నారు. అయితే, పొరపాటుపడ్డ లోకేశ్.. ‘రాబోయే రెండేళ్లలో అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పాటే తన లక్ష్యంగా పెట్టుకున్నానని అన్నారు. దీంతో, ఆశ్చర్యపోవడం కరప వాసుల వంతు అయింది.