: ధోనీని మించిన గొప్ప ఫినిషర్ లేడు: షేన్ వార్న్
ఈ ఐపీఎల్ సీజన్ లో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీపై విమర్శకులు నోరు పారేసుకుంటున్నారు. అతని సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ధోనీపై ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ప్రశంసల వర్షం కురిపించాడు. మ్యాచ్ ను ఫినిష్ చేయడంలో ధోనీకి మించినవాడు లేడని వార్న్ అన్నాడు. ఎవరి ముందూ ధోనీ తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని తెలిపాడు. ఎంతో స్ఫూర్తిదాయకమైన కెప్టెన్ ధోనీ అని కొనియడాడు. క్లాస్ ఆటగాడంటూ కితాబిచ్చాడు.