: లాస్ట్ వర్కింగ్ డే.. అద్భుత జర్నీ.. మంచి అనుభవం: ‘బాహుబలి’ గురించి రాజమౌళి
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి ది కంక్లూజన్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు నేటితో పూర్తికానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజమౌళి తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశాడు. ‘లాస్ట్ వర్కింగ్ డే, అద్భుత జర్నీ .. మంచి అనుభవం.. ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా పూర్తయినందుకు ఎంతో ఆనందంగా ఉంది.. కొద్దిగా బాధగా కూడా ఉంది’... అని ఆయన పేర్కొన్నాడు. ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. సినిమా విడుదలకు సిద్ధమవుతుండడంతో ఆ సినిమా యూనిట్ ఇప్పుడు ప్రచార కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటోంది. బాహుబలి రెండు పార్టులకీ కలిపి సుమారు ఐదేళ్లు పట్టింది.
Last working day......hope fully..