: 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనలు కలసి పని చేస్తాయి: అయ్యన్నపాత్రుడు


2019లో జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు కలసి పని చేస్తాయని మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను చెప్పిన విషయాన్ని కావాలంటే పేపర్ మీద రాసి పెట్టుకోవాలని చెప్పారు. మరోవైపు, 2019లో ఇరు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. అంతేకాదు, రాజకీయపరమైన కొన్ని అంశాల నేపథ్యంలో కూడా బీజేపీతో పవన్ అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

  • Loading...

More Telugu News