: కోహ్లీకి పలు కీలక సలహాలు ఇచ్చిన గంగూలీ


ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుస పరాజయాలతో చతికిలపడింది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 5 మ్యాచ్ లు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ జట్టు కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో, ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీకి టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ పలు సూచనలు చేశాడు. గెలుపు కోసం మరింత శ్రమించాల్సిన అవసరం ఉందని దాదా చెప్పాడు. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ను తప్పించి, విండీస్ విధ్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ ను ఆడించాలని సూచించాడు. గేల్ లాంటి ఆటగాడు జట్టుకు చాలా అవసరం అని చెప్పాడు. అతడిని రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేయడం మంచి పరిణామం కాదని అన్నాడు. పెద్దగా రాణించలేకపోతున్నప్పటికీ వాట్సన్ ను ఆడిస్తున్నారని చెప్పాడు. డీవిలియర్స్ ను ఐదు లేదా ఆరో స్థానంలో ఆడిస్తే ఫినిషర్ గా ఉపయోగపడతాడని తెలిపాడు. ఆర్సీబీ పుంజుకుంటుందనే నమ్మకం తనకుందని చెప్పాడు. 

  • Loading...

More Telugu News