: విషాదకరంగా ముగిసిన వాటర్ ఫెస్టివల్.. 285 మంది మృతి
వాటర్ ఫెస్టివల్... మయన్మార్ లో ప్రతి ఏటా సంప్రదాయ బద్ధంగా జరుపుకునే ఒక వేడుక. కొత్త సంవత్సరంలో వేసవి ముగిసే సమయంలో ఈ వేడుకను అక్కడ జరుపుకుంటారు. ఈ పండుగను వారి భాషలో 'థింగ్యాన్' అని పిలుస్తారు. బౌద్ధాన్ని అనుసరించేవారు ఈ వేడుకను జరుపుకుంటారు. గత సంవత్సరం చేసిన పాపాలు కొత్త సంవత్సరంలో నీటితో కడిగేసుకుంటే పోతాయనే విశ్వాసంతో మయన్మార్ ప్రజలు ఈ వేడుకను నిర్వహించుకుంటారు. రోడ్డు మీద వెళ్లే వారిపై లీటర్ల కొద్దీ నీటిని కొడుతూ ఈ వేడుకను జరుపుకుంటారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో 285 మంది మృతి చెందారు. మరో 1073 మంది గాయపడ్డారు.