: తన ఆఖరి కోరికను చెప్పి నెరవేర్చుకున్న దేవినేని నెహ్రూ!
రాజకీయ నేతగా పుట్టింది తెలుగుదేశం పార్టీలోనే అయినా, పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆపై తిరిగి వెనక్కు వచ్చిన సందర్భంలో దేవినేని నెహ్రూ చెప్పిన మాటలను ఇప్పుడు ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి సమక్షంలో కుమారుడు అవినాష్ తో సహా పార్టీలో చేరిన వేళ, ఆయన మాట్లాడుతూ, పసుపు జెండాతోనే తన రాజకీయ జీవితం మొదలైందని గుర్తు చేసుకున్నారు. ఆ జెండా కప్పుకునే చనిపోతానని, తన చివరి కోరిక అదేనని కూడా అన్నారు. ఇప్పుడు ఆయన మాటలను నెమరేసుకుంటున్న దేవినేని అభిమానులు, కార్యకర్తలు, ఆయన తన ఆఖరి కోరికను తీర్చుకున్నారని అంటున్నారు.