: భువనేశ్వర్ సూపర్ ఫీట్... సన్ రైజర్స్ విజయం
హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 19వ ఉత్కంఠభరిత మ్యాచ్ లో 5 పరుగుల ఆధిక్యంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో డేవిడ్ వార్నర్ (70 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ సాయంతో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు సాధించింది. అనంతరం 160 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ను సన్ రైజర్స్ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ సూపర్ ఫీట్ తో కుప్పకూల్చాడు.
నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్ కేవలం 19 పరుగులు ఇచ్చి 5 కీలక వికెట్లు తీశాడు. ప్రధానంగా మ్యాచ్ లో దూకుడు ప్రదర్శించి, ఒంటరి పోరాటం చేసిన మానన్ వోహ్రా (95) ను భువీ అవుట్ చేయడంతో పంజాబ్ ఓటమి ఖరారైంది. దీంతో పంజాబ్ 19.4 ఓవర్లలో ఆలౌట్ అయింది. దీంతో ఈ సీజన్ లో వరుస ఓటముల తరువాత సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు సొంత మైదానంలో విజయం సాధించడం అభిమానులను ఆనందానికి గురి చేసింది. భువనేశ్వర్ కుమార్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.