: నాకిప్పుడే సీఎం కావాలన్న ఆశలేదు... హరీష్ కు, నాకు మధ్య గ్యాప్ లేదు: కేటీఆర్
తనకిప్పుడే ముఖ్యమంత్రి కావాలన్న ఆశలేదని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సిద్ధిపేటలో త్వరలో బహిరంగ సభ నిర్వహించనున్నామని తెలిపారు. మున్సిపల్ మంత్రి అయ్యాక బాధ్యతల్లో పడి ప్రజలతో ర్యాపో తగ్గిందని భావిస్తున్నానని, అందుకే సిద్ధిపేటలో బహిరంగసభ నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. మరో పదేళ్లపాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా నిరాటంకంగా కేసీఆర్ కొనసాగుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తనకు, మంత్రి హరీష్ రావుకు మధ్య దూరం ఉందని వచ్చేవన్నీ పుకార్లేనని ఆయన చెప్పారు. తామిద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని ఆయన స్పష్టం చేశారు.