: హైవేపై 15 నిమిషాల పాటు ట్రాఫిక్ ను ఆపేసిన 12 సింహాలు!
గుజరాత్ అమ్రేలీ సమీపంలోని పిప్వావ్-రాజౌళ హైవే పైకి అర్ధరాత్రి సమయంలో డజను సింహాలు వచ్చాయి. అడవి లోంచి సింహాలు ఒక్కసారిగా రోడ్డు మీదికి రావడంతో పలువురు ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. అయితే కార్లు, లారీలు, ఇతర వాహనాల్లో ఉన్నవారు తమ చేతుల్లోని మొబైల్ కు పని చెప్పారు. ఓ లారీ డ్రైవర్ సింహాలు రావడాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో దానిని నెటిజన్లు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. సింహాలు రోడ్డు మీదకి రావడంతో ఆ జాతీయ రహదారిపై సుమారు 15 నిమిషాలు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయని ఆ లారీ డ్రైవర్ తెలిపారు.