: నాటి తన సీరియల్ పాట రీమిక్స్ పై నేడు స్పందించిన స్మృతీ ఇరానీ
స్మృతీ ఇరానీ... నేడు కేంద్రమంత్రిగా ఉన్నప్పటికీ, గతంలో నటిగా సత్తాచాటారు. దూరదర్శన్ లో ఆమె నటించిన 'క్యూకీ సాస్ భీ కభీ బహూ థీ' సీరియల్ తో ఆమె ఎంతో పాప్యులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ సీరియల్ లోని పాటను రీమిక్స్ చేశారు. ఇద్దరు పంజాబీ యువకులు డ్యాన్స్ చేస్తూ తీసిన వీడియోను పోస్టు చేస్తూ, స్మృతీ ఇరానీకి దాన్ని ట్యాగ్ చేయగా, ఆమె స్పందించడం గమనార్హం. "పంజాబీలు ఏ సంగీతానికైనా డ్యాన్స్ చేయగలరు... ఎందుకంటే, వారికి పుట్టకలోనే ఓ సొంత రిథమ్ ఉంది" అంటూ చేసిన పోస్టుపై స్మృతీ స్పందిస్తూ, "అంగీకరిస్తున్నా! పాజీస్ పావో భాంగ్రా" అని ఆమె రిప్లయ్ పెట్టారు.
Agreed!!! Paajis pao Bhangra. https://t.co/bdNtKCB1h5
— Smriti Z Irani (@smritiirani) 17 April 2017