: రజనీకాంత్ ను హీరోగా పెట్టి ఓ చిత్రం తీద్దామనుకున్నా: నటుడు మమ్ముట్టి


తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను ప్రముఖ నటుడు మమ్ముట్టి డైరెక్టు చేయాలనుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా మమ్ముట్టియే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 1997లో వచ్చిన ‘భూతక్కన్నడీ’ సినిమాలో రజనీ కాంత్ ను హీరోగా పెట్టి తన దర్శకత్వంలో తెరకెక్కించాలనుకున్నాడట. ఈ సినిమా కథను రజనీ విన్నారని, అయితే.. ఎందుకో, కార్యరూపం దాల్చలేదని మమ్ముట్టి గుర్తు చేసుకున్నాడు. దాంతో, మమ్ముట్టి హీరోగా ‘భూతక్కన్నడీ’ సినిమాను లోహిత్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కించాల్సి వచ్చింది. ఈ చిత్రంలో నటనకు గాను మమ్ముట్టికి ఫిల్మ్ ఫేర్ అవార్డు లభించింది.

  • Loading...

More Telugu News