: నేను పవన్ కల్యాణ్ అభిమానిని: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే తనకు ఇష్టమని, తాను పవన్ అభిమానినని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ నటుడి గురించి ప్రశ్నించగా ఆయన పవర్ స్టార్ పేరును చెప్పారు. పవన్ కు తాను పెద్ద అభిమానినని, ఇటీవల విడుదలైన కాటమరాయుడు చిత్రాన్ని మొదటి రోజు మొదటి షోనే చూశానని చెప్పారు. పనవ్ సినిమా ఎలా ఉన్నా తాను చూస్తానని, సినిమా బాగుండటం, బాగుండకపోవడంతో ఫ్యాన్స్ కు పనిలేదని అన్నారు. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, కొన్నేళ్ల క్రితం విడుదలైన పవన్ కల్యాణ్ ‘జానీ’ చిత్రాన్ని ఏడు సార్లు చూశానని ఆయన చెప్పడం.